‘హైదరాబాద్‌కు మంచి పేరు ఉంది.. దయచేసి’

 హైదరాబాద్‌ : కరోనా వైరస్‌పై ఐటీ కంపెనీల ప్రతినిధులతో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వివిధ ఐటీ కంపెనీల సీఈవోలు, హైసియా మెంబర్స్‌, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రతినిధులు హజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. కరోనాపై సోషల్‌ మీడియాలో వచ్చిన వదంతుల వల్ల ఐటీ కారిడార్‌లో రెండు రోజుల క్రితం ఏర్పడిన భయాందోళన పరిస్థితి.. ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చిందన్నారు. ఎవరూ సోషల్‌ మీడియాలో వదంతులు ప్రచారం చేయవద్దని, కరోనాపై ఏవైనా అపోహలుంటే సైబరాబాద్‌ పోలీసులను సంప్రదించాలని సూచించారు. (వరంగల్‌: కరోనా కలకలం..! )