వాషింగ్టన్ : కరోనా వైరస్‌తో బాధపడుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ త్వరగా కోలుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. ఆదివారం కరోనా వైరస్‌పై జరిపిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ కరోనా వైరస్‌తో పోరాడుతున్న బోరిస్‌కు మా దేశం తరపున మంచి జరగాలని కోరుకుంటున్నాం. అమెరికన్లు ఆయన కోసం ప్రార్థిస్తున్నారు. బోరిస్ నాకు మంచి మిత్రుడు, గొప్ప వ్యక్తి. మనందరికీ తెలుసు! ఈ రోజు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడు కచ్చితంగా కోలుకుంటాడని భావిస్తున్నాన’ని అన్నారు. ( పెరుగుతున్న కేసులు.. ఎమర్జెన్సీకి అవకాశం )
అమెరికన్లు ఆయన కోసం ప్రార్థిస్తున్నారు: ట్రంప్