ఎట్టకేలకు ప్రేమను బయటపెట్టిన బిగ్‌బాస్‌ జంట

హిందీ బిగ్‌బాస్‌ 11 కంటెస్టెంట్స్‌ ప్రియాంక్‌ శర్మ, బెనాఫ్‌షా సూనావాలా వారి రిలేషన్‌షిప్‌ను సోషల్‌ మీడియాలో ప్రకటించారు. రెండేళ్లు నుంచి సిక్రేట్‌గా డెటింగ్‌లో చేస్తున్న ఈ జంట వారి ప్రేమను సోమవారం అధికారంగా వెల్లడించారు.  ప్రియాంక్‌ వారిద్దరూ సన్నిహితం ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘అవును ప్రేమలో ఉన్నాం’ అనే క్యాప్షన్‌కు హర్ట్‌ ఎమోజీని జత చేసి షేర్‌ చేశాడు. అలాగే బెనాఫ్‌షా కూడా అదే చిత్రాన్ని ఇన్‌స్టాలో పంచుకుంది. ‘మా ప్రేమను అందరిలాంటి ప్రేమలా చూడకండి. ఎందుకంటే నాది అసాధారణమైన ప్రేమ’ అంటూ ఆమె రాసుకొచ్చింది. (వైరల్‌ ట్వీట్‌: బిగ్‌బీపై నెటిజన్ల ఫైర్‌)